సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ వుంటుంది. మెళ్ళో నెక్లేస్ కు గాజు పైన నిలబెట్టినట్లు అన్నమాట. గాజు పైన గుండ్రని చిన్నగా వుండే బంగాడి అని ఇంకా రకరకాల ఆకారాల్లో వుండే గ్రోఖ్రా అని, ముత్యాలు పొడిగితే గాజ్రా అని ఎనెన్నో వెరైటీస్. ఇదివరకు రాజస్థాన్ కే పరిమితం. ఇప్పుడీ అందాల్ని మోడ్రన్ డిజైన్లతో పరిచయం చేస్తున్నారు డిజైనర్లు. యాంటిక్ నగలు ఇష్టపడే వారికి ఎన్నో వెరైటిస్ కనిపిస్తాయి.
Categories