ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్  బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి అందరి దగ్గరకు చేరాయి. చెవిపోగులు నెక్లెస్ లు పెండెంట్లు ఇలా ఎన్నోరకాల సీటెచ్  దారంతో ఎంబ్రాయిడరీ పద్దతి తో రకరకాల పూసలు రాళ్ళూ గుచ్చి  రత్నాభరణాలంత భారీగా రూపం దిద్దుకుని వస్తున్నాయి . ఇది సాధారణంగా దుస్తుల ఎంబ్రాయిడరీ పద్ధతి. రెండుమూడు రంగుల దారాల్ని  పక్కపక్కన పేర్చి  కావాల్సిన డిజైన్ లో దాన్ని వంపులు తిప్పుతూ దుస్తులపైన ఎంబ్రాయిడరీ చేసేవారు. ఇప్పుడు వీటిని అంతే అందంగా వేసుకున్న దుస్తులకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఈ దారాల్లో  అన్నీ వర్ణాలు దొరుకుతాయి. కనుక ఏ  వర్ణపు దుస్తులకైనా కరెక్ట్ గా సరిపోయేలా ఎంచుకోవచ్చు. ఇవి రంగురాళ్ల ఖరీదైన ముత్యాలు రత్నాలు కలబోసుకుని అద్భుతంగా కనిపిస్తూ కాలేజీలో కార్పొరేట్ ల ట్రెండ్ అయిపోతున్నాయి.

Leave a comment