నీహారికా ,

సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం ఫలితం వైపే చూస్తాము కానీ అసలా పని ఎంత బాగా చేసాం దానికి విజయం సాధించే బలం వుందా లేదా అని ఆత్మ విమర్శ ముందే చేసుకొం. అసలు చేసే పని పట్ల శ్రద్ధ  మొత్తం పెట్టేస్తే అప్పుడు ఫలితం విజయం వైపే ఉంటుంది. శరీరం ఒక టూల్ కిట్ లాంటిది. ఎన్నోపనులు చేయగలదు. కానీ మనస్సుని తెలివి తేటల్ని ఒక దగ్గరే ఉంచి శరీరం మనే ఆయుధాన్ని విజయం వైపుగా సిద్ధం చేయాలన్నమాట. మనకు భావాలు  ఎమోషన్లు వీటితోపాటు మేధావితనం విచక్షణా  శక్తి  ఉంటుంది. విశ్లేషణ కోణాలు నిర్ణయాలు మేధస్సు నుంచే పుడతాయి . మనసు పరిపరివిధాల ఆలోచనలు చేస్తుంది. దాన్ని మేధావితనం గైడ్ చేయాలి. నదికి తీరం ఎలాంటిదో అలాంటిదన్నమాట. తీరం బలహీనంగా ఉంటే నది కట్టలు తెంచుకుంటుంది. మేధస్సు బలంగా ఉంటే మనసుని నియంత్రిస్తుంది . లేకుండా మనస్సు మేధావి తనాన్ని పక్కనపెట్టి వైఫల్యం వైపు అడుగులు వేయిస్తుంది.. ఆరోగ్యవంతమైన మనస్సు దాన్ని అదుపు చెప్పే మేధావి తనం ఉంటే చాలన్నమాట.

Leave a comment