నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్  ఎముకల సాంత్రత  పోవటంలో ఆ లాస్ ఎక్కువగా వెన్నుముక్కలో కనిపిస్తుంది. అందుకే వ్యాయామాలు చేయండి. వెన్ను ను బలంగా ఉంచుకోండి  పోశ్చర్ ను కుదురుగా నిటారుగా ఉండేట్లు కూర్చోవడం నడవటం చేయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే వెన్నుకు కుషన్ గా వుండే డిస్క్ లు ఎత్తు తగ్గుతాయి. అంటే కొన్నాళ్ళు తలగడలు వాడితే అవి మెత్తగా అయిపోయి కుంగి పోయినట్లున్న మాట.నలభై దాటాక అక్కడి నుంచి ప్రతి ఏడేళ్లకు అర అంగుళం చొప్పున ఎత్తు తగ్గుతూనే ఉంటారు. ఈ ప్రక్రియ 70 ఏళ్ళు తర్వాత ఇంకా పెరుగుతుంది. మొత్తం మ్మీద  రెండంగుళాల కంటే ఇంకా ఎక్కువే ఎత్తు తగ్గిపోతారు . అందుకే మనం చాలా మంది పెద్దవాళ్ళని చూసినప్పుడు వెన్ను వంపు తిరిగి ఎముకల్లో సాంత్రత  తగ్గిపోయి వంగిపోయి కనిపిస్తారు. పెద్దతనం వల్ల  అలా కుంగిపోయారంటాం  కానీ వెన్నుకు బలోపేతం చేసే వ్యాయామాన్లు వాకింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఎప్పటికీ కుంగి పోవటం ఉండదు.

Leave a comment