ఆ.ఆ లో నేను నటించిన నాగవల్లి క్యారెక్టర్ లాగే కోపం వస్తే మారిపోతా …మనం కరెక్ట్ గా అన్ని పనులు చేస్తాం,ఇతరులు చేయకపోతే అందరికీ నష్టం కదా.అలాంటప్పుడు నాకు విపరితమైన కోపం వస్తుంది.ఇంకెందుకు చెప్పటం. నిజానికి ఆ కోపమే నా మైనస్ అంటోంది అనుపమ పరమేశ్వరన్ . నేను చాలా సెన్సిటివ్ చాలా కూల్ గా ఉంటాను .ఎవ్వరినీ పల్లెత్తు మాట అని బాధపెట్టటం నిజంగా ఇష్టం లేదు. కానీ ఒక్కోసారి కోపం ఇవన్ని డామినేట్ చేస్తుంది. ఇక ఆ సమయంలో అవతలి వాళ్ళు ఎవరైన కూడా నాకు పట్టదు. దీన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్న అంటోంది అనుపమ పరమేశ్వరన్. ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి,కెరీర్ గ్రాఫ్ చక్కగా ఉంది. షూటింగ్ కు టైమ్ కు వెళ్తా ,పని పర్ఫెక్ట్ గా చేస్తా. ఎవ్వళ్ళతో ఒక్క మాట అనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు అంటోంది ఈ అమ్మాయి.
Categories