నల్గొండకి చెందిన సరిత ఢిల్లీలో తొలి మహిళ బస్సు డ్రైవర్ గా పని చేస్తోంది. హైదరాబాద్ లో మినీబస్ లు ,ఆటోలు నడిపి ఆ నైపుణ్యంతో భారీ వాహానాలు తోలే లైసెన్స్ పొందింది. ఢిల్లీలోని సఖీ క్యాబ్స్ లో చేరింది సరిత. అక్కడే రూట్ మ్యాప్ ని అర్ధం చేసుకుని ,ఆత్మరక్షణలో శిక్షణ తీసుకుని ఢిల్లీ రవాణా శాఖలో పని చేసే అవకాశం సంపాదించింది. మూడేళ్ళుగా ఢిల్లీలో జాబ్ చేస్తోంది సరిత.

Leave a comment