మార్గ్యూ ఆఫ్రికా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన తెగకు చెందిన ఉద్యమకారుడు. 84 ఏళ్ళ వయస్సులో ఓ చెవికి పూర్తిగా వినికిడి శక్తి పోయాక, ఓ కాలు దెబ్బతిని కుంటుతు నడుస్తూ , స్కూల్ కు వెళ్ళి చదువుకోవాలనుకొంటాడు. కెన్యాలోని ఓ పల్లెటూరి స్కూల్లో , ఎందరో నిరసనల మధ్య జాయిన్ అవుతాడు. అన్నీ ఇబ్బందులు అధికమించి ఆ స్కూల్లో చదువుకొంటాడు. ఈ సినిమా The First Grader .ఇది బయోపిక్ మార్గ్యూ నిజ జీవిత గాథ. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు ,రివార్డులు ,ప్రశంసలు పొందిన ఈ చిత్ర దర్శకుడు జస్టిన్ చాడ్విక్. చదువు విలువ చేప్పే ఈ సినిమా పిల్లలు,పెద్దలు అంతా చూడాలి.

Leave a comment