30 ఏళ్ళ నుంచి బార్ అటెండర్ గా కాక్ టెయిల్స్ కలిపే ఉద్యోగంలో ఉంది శబ్ధిబసు. ఎప్పటికీ ఇది మహిళలు అడుగు పెట్టే ఉద్యోగమే కాదంటారు , కానీ కోరుకున్న చదువు చదివి ,ఇంట్లో అందరిని ఒప్పించి మరీ జాబ్లో చేరింది శబ్ధిబసు. ఎంతో కాలం అనుభవం సంపాదించి బార్ టెండర్ అకాడమీ మొదలు పెట్టింది. ఎంతో మంది నిపుణులను తయారు చేసింది. సింగపూర్ ,న్యూయర్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది. ఇప్పటికి ఇది స్త్రీలు కోరుకొనే ఉద్యోగమేనా అని అడిగితే కష్టమే అంటుంది శబ్ధి.

Leave a comment