పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్  హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే క్రమంలో ఒత్తిడితో జుట్టు కాలిపోయి యధాతధంగా మళ్ళీ వస్తుంది. మరీ ఊడటం తగ్గకపోతే శిరోజాల నిపుణులు హెయిర్ సప్లిమెంట్లు మాడుకు అప్ప్లయ్  చేయవలిసిన పోషకాలు ఇస్తారు. శిరోజాలకు చక్కని ఫీడింగ్ కావాలి. గుడ్లు సొయా లెంటిల్స్ చేపలు చికెన్ ప్రోటీన్స్ వారంలో రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకుని వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో దువ్వుకోవాలి.

Leave a comment