సముద్ర గర్భంలోని చాలెంజర్ డీప్ వరకు వెళ్లి వచ్చారు క్యాథరిన్ సలవీన్ .భూ ఉపరితలం నుంచి సముద్ర గర్భంలో కి  ఏ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగు వరకు వెళ్లి వచ్చారామే .అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానం చేరుకోవటం అంటే అది శూన్యంలో ఈదటం వంటిది. క్యాథరిన్ 37 సంవత్సరాల క్రితం అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళగా గుర్తింపు తెచ్చుకొన్నారు.ఈ సముద్ర గర్భం లోకి వెళ్ళిన తొలి ప్రపంచ మహిళా కూడా అయ్యారు.భూ గర్భ శాస్త్రంలో పి హెచ్ డి  చేశారు ఎం .ఎస్ నేవల్  రిజర్వ్ లో జాషనో  గ్రఫీ ఆఫీసర్ గా  పనిచేశారు నాసా లో పనిచేశారు.

Leave a comment