చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే ఆ మిశ్రమంలో వుంచగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా గోళ్లు బలంగా ఉంటాయి. గోళ్లకు నారింజ రసం కూడా మంచిదే. రసం ముంచి గోళ్లను కాస్సేపు ఆలా వదిలేసి కడిగేస్తే చాలు. పొడిగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ఆలివ్ నూనె నిమ్మరసం మిశ్రమంలో గోళ్లు ముంచి పదినిముషాలు తర్వాత కడిగేస్తే గోళ్లు పెళుసు బారిపోకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన లో ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కలిపి వేళ్ళను అందులోవుంచి మేనిక్యూర్ చేసుకుంటే గోళ్లు శుభ్రంగా ఉంటాయి. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మం సాగిపోకుండా టైట్ గా ఉంటుంది.
Categories
Soyagam

గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

Leave a comment