ప్రొద్దుటే వ్యాయామాలు చేయటం మంచిది అనుకొంటారు కానీ ,ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజులు చేయటం మంచిది కాదంటున్నారు . వర్కవుట్స్ కు ముందు తిన వలసిన పదార్దాలు ఉంటాయి కాంప్లెక్స్ ,సింపుల్ కార్బోహైడ్రేట్స్ తినాలి . దానివల్ల వర్కవుట్స్ చేసినంత సేపు లోపల శక్తి నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది . రోజంతా ఎనర్జీ లభిస్తుంది .    ఉదయం వ్యాయామం చేసేముందర అరటిపండు లేదా ఒక పూర్తి పండును టోస్ట్ తో పాటు తినాలి. వ్యాయామానికి కాస్త ముందు గా తినే అవకాశం లేకపోతే స్ముదీ సరైన ఛాయిస్ . లో స్పాట్ యోగర్ట్ . ఇష్టమైన ఫ్రూట్ స్లైస్ తినాలి పని గంటలు పూర్తి చేసుకొని ఏ సాయంత్రం వేళనో వ్యాయామం చేస్తూ ఉంటే ఎక్కువ కూరలతో గోధుమ శాండ్ విచ్ తినాలి . నిమ్మరసం లేత కొబ్బరి నీరు తాగాలి .

Leave a comment