Categories
యూకేలోని ఈక్వల్ మెజర్స్ 2030 అన్న సంస్థలో సహజ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వివాహామైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు భర్త పెట్టే హింసకు గురవుతున్నారని తేలింది. వడోదరలోని సహజ అనే స్వచ్చంద సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ అంశం రుజువైంది.ఒక వైపు ఇండియా అధికంగా పురోగమిస్తున్నట్లు కనిపిస్తొంది.కాని లైంగిక విషయాల్లో మాత్రం తిరోగమనమే. స్త్రీల సంక్షేమం,వారి ఆరోగ్యం ఏమీ మెరుగ్గా లేదు.స్త్రీల భద్రత రక్షణ,అనేవి ఈ దేశంలో ఏ మాత్రం ప్రాముఖ్యత లేని అంశాలుగా అయిపోయాయని సర్వే రిపోర్ట్ చెబుతుంది.