Categories
రంగులు మనసుని, ఆలోచనను, మూడ్ ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని రంగుల దుస్తులు ధరించినప్పుడు మనసును హాయిగా ఉంచేందుకు కారణం ఇదే. తెల్లని తెలుపు మనసుకు ప్రశంతత ఇస్తుంది. ఇది శాంతికి గుర్తు నీలం రంగు మనసుకు ఆహ్ల్లాదం ఇస్తుంది. అందుకే బెడ్ రూం గోడలు నీలం రంగులో ఉంచుకోమంటురు. ఈ రంగు మెదడు పై చూపించే ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులోనే ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. హస్పిటల్ వాతవరణం లో కర్టెన్లు, దుప్పట్లు అన్ని ఆకుపచ్చనే ఉంటాయి. ఇక పసుపురంగు మెదడును చురుకుగా ఉంచుతుంది. ఇది స్నేహన్ని తెలియజేస్తుంది. అందుకే సందర్భాన్ని బట్టి దుస్తుల విషయంలో కొన్ని రంగులు ఎంచుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.