Categories
మహారాణులు ధరించే భారీ వస్త్రాలు బరువనిపించి సిల్క్ తో తయారయ్యే షిఫాన్ చీర కట్టుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు బరోడా రాణి ఇందిరా దేవి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను పెళ్లాడిన ఇందిరాదేవి ధరించి షిఫాన్ చీరెలు చూపరులను ఆకర్షించేవి ఫ్రాన్స్ నుంచి ఖరీదైన వస్త్రాన్ని తెప్పించుకుని కళాకారులతో డిజైన్ చేయించుకునేధామే ఇందిరాదేవి కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా తల్లి షిఫాన్ చీర కట్టుకునే అనుసరించారు ఇందిరాదేవి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్ గాయత్రీదేవి ప్రపంచంలోని పది మంది అందమైన స్త్రీలలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు ఇప్పటికీ ఫ్రెంచ్ లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది.