Categories
పచ్చలు,కెంపులు ,వజ్రాలు,పగడాలు ,నీలం ,ముత్యం గోమేధకం వంటి రత్నాలతో నగలు ఇవ్వాల్టి ట్రెండ్. ఇవి పాత తరం నగలే కానీ కొత్తగా ఎన్నో ఆకృతులతో కనువిందు చేస్తున్నాయి. నవ రత్నాలు చాలా ఖరీదైనవి .ఇవి జాగ్రత్తగా ఎంచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి కూడా. కానీ పెళ్ళి వేడుకల్లో నూ ముఖ్యమైన సందర్భాలలో ఈ నవ రత్నాల నగలు ప్రత్యేక అందాన్నిస్తాయి. టెంపుల్ జ్యువెలరీ గా సింపుల్ గా గొలుసులో లాకెట్ గా వేసుకోన్న ఇవి రకరకాల రత్నాలతో కొన్నింటిని ఇయర్ రింగ్స్ గా అలంకరించుకొన్న సింపుల్ గా మాత్రం ఉండటం కష్టం. నవ రత్నాల నగలు నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.