రాఫుడ్ తినడం వల్ల ఇటు శరీరం శక్తి వంతం అవుతుందనీ, అలాగే బరువు తగ్గుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారపు అలవాట్లు సాధారణంగా వ్యాక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరోగ్య వంతమైన మహిళలు సరైన పదార్ధాలు తింటూ శరీరతత్వానికి వీలుగా మార్పులు చుసుకుంటారు. తమ శరీరం ఇచ్చే సిగ్నల్స్ సకాలంలో అందుకుంటారు. అదృష్టవసాతూ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ అలక్ట్స్ ప్రసిద్ది చేడుతున్నాయి. ప్రజలు కుడా ఆరోగ్యవంతమైన ఆహారం వైపు మొగ్గు చూపిస్తారు. రెడీ టో మేక్ పదార్ధాలలో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లారా ఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిపై చేసుకో వచ్చు. క్లెన్స్ చేయవచ్చు. పండ్లు, నట్స్, మొలకలు, బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకుంటే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త తిసుకోవాలి. కొలాలు, చిరు తిండ్ల తాత్కాలికంగా కడుపు నింపినా అలసట ఇస్తాయే తప్ప శక్తిని ఇవ్వవు. కాబట్టి వీలైనప్పుడల్లా రాఫుడ్ తీసుకోవడం మంచిదే. ఇందువల్ల బరువు కూడా తగ్గుతాయంటున్న అధ్యయినాలు.
Categories