తగినన్ని పోషకాలు తీసుకొని కాసేపు వ్యాయామం చేస్తేనే అందం ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . పోషకాహారం తీసుకోవటం లో వ్యాయామంలో వెనకబడినందువల్లే అమ్మాయిలు అనారోగ్యాల పాలవుతున్నారు అని చెబుతున్నారు. ఉదయం లేవగానే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఓ అరగంట వ్యాయామం తప్పనిసరి తరవాత ఓ పది నానబెట్టిన బాదం గింజలు రెండు ఖర్జూరాలు గ్లాసు పాలు లేదా ఇడ్లీ, పాలు తాగాలి. అల్పాహారానికి భోజనానికి మధ్య పళ్లరసం తాగచ్చు. ఐరన్, జింక్, క్యాల్షియం దొరికే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు, మాంసం, చేపలతో మధ్యాహ్న భోజనం ఉండాలి. రాత్రి వీలైనంత తేలికగా చపాతీలు కూరలు అన్నం తినాలి. శక్తినిచ్చే స్నాక్స్ తినాలి ఇంత పౌష్టిక ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.

Leave a comment