వర్షాలు మొదలయ్యాయి లాక్ డౌన్ తో షికారుకు వెళ్లకపోయినా ఏ ఫ్రూట్స్ కోసమో, సరుకుల కోసమో బయటకు వెళ్ళక తప్పదు.అప్పుడు వర్షం వస్తే హ్యాండ్ బ్యాగ్ తో సహా మొత్తం వస్తువులు తడిసిపోతాయి. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో నాలుగైదు జిప్ లాక్ కవర్లు ఉంచుకోవాలి.డబ్బులు, ఫోన్ లు వంటివి వాటిలో పెట్టుకోవచ్చు. పెద్ద పాలిథిన్ కవర్లు,లేదా ఓ లెదర్ సంచి వంటిది బ్యాగ్లో ఉంచుకుంటే మొత్తం వస్తువులకు రక్షణ ఉంటుంది .అలాగే వర్షం రాగానే ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది.బీరువాల్లో తేమగా ఉంటుంది.కర్పూరాన్నిఅరల్లో పెడితే సిల్వర్ ఫిష్ వంటి పురుగులు రాకుండా మంచి సువాసన గా ఉంటుంది .వర్షాకాలం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.వర్షాలకు అనువైన దుస్తులు ధరించాలి. బ్యాగ్ లో తప్పని సరిగా ఒక చిన్న గొడుగు ఉండాలి అప్పుడు చినుకులు పడి పెద్ద చికాకు ఉండదు.వర్షాన్ని ఆనందించవచ్చు .
Categories