Categories
బట్టలు, నగలు, బ్యాగ్ లు చెప్పులూ అన్ని మ్యాచింగ్సే ఉండాలంటారు అమ్మాయిలు. మరి అలాంటి చెప్పులు సాదాసీదాగా ఉంటే ఎట్లా అనుకొని ఫ్యాషన్ డిజైనర్లు ఘుంఘ్రా ఫుట్ వేర్ పేరుతో మువ్వల చెప్పుల్ని మార్కెట్ లోకి తెచ్చారు రకరకాల సైజుల్లో మువ్వనీ పొదిగిన ఈ చెప్పులు పార్టీ వేర్ శాండిల్స్ నుంచి ఫ్లాట్స్ వరకు మువ్వలు గలగల తో ఆకర్షిస్తున్నాయి. వెరైటీ కావాలనుకునేవారు వెంటనే కొనుక్కొనేంత అందంగా ఉన్నాయవి.