పప్పులో వెల్లుల్లి ఇంగువా తాళింపు ,వంకాయ కూరలలో మసాలా ఘుమ ఘుమలు ,బిర్యానిలో నేతిలో వేసిన మసాల ఘాటు ఇలా మనం రోజు తినే ఆహారంలో ఎన్నో దినుసులు వాడతాం. భారతీయ వంటకాల్లో ఎన్నో మసాలా దినుసులకే అగ్రస్థానం .అధ్యయనాలు రోజుకో చిటికెడు మసాలా తగిలిస్తే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. మసాలాలోని లవంగాలు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి.ఎసిడిటిని దూరం చేస్తాయి. మిరియాలు ,యాలకులు ,దాల్చిన చెక్క ,గసగసాలు జీర్ణశక్తిని పెంచి శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.గరం మసాలాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. చర్మ సమస్యలు నోటి దుర్వాసన తగ్గిస్తాయి. గరం మసాలాని మితంగా ప్రతి రోజు తీసుకొమ్మని చెపుతున్నారు న్యూట్రిషనిస్టులు.

Leave a comment