Categories
కొంతమంది బరువు తగ్గటం కోసం తినటం మానేస్తారు . దీనివల్ల జీవక్రియ మీద దుష్ప్రభావం పడుతుంది . ఒక మనిషి అతిగా తిన్నా లేదా చాలా సమయం తినకపోవడం చేస్తే శరీరం క్యాలరీలు నిదానంగా కరిగించుకోవటం మొదలు పెడుతుంది. కొవ్వు కణాలను మరింతగా నిల్వ ఉంచుకోవటం ప్రారంభిస్తుంది . సరైన సమయంలో భోజనం చేస్తే ఇదేమీ ఉండదు . అతి తక్కువగా తింటూ జీవక్రియలు మందగించి శరీరం శక్తిని ఉంచుకోవాలని చూస్తుంది . స్త్రీలకు రోజుకు 1600 నుంచి 2400 వందల వరకు ,పురుషులకు 2000 నుంచి 3000 వేలు వరకు క్యాలరీలు ఇచ్చే ఆహారం కావాలి . వారు చేసే పనులను బట్టి ఈ క్యాలరీలు కాస్త ఎక్కువో ,తక్కువో అవసరం అవుతాయి .