హరియాణా లోని ఆంచల్ సెంట్రల్ జైల్ లో ఆరుగురు మహిళా ఖైదీలకు ఆర్జే లుగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది వర్తికా నందా. ఢిల్లీ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తికా నందా సెంట్రల్ జైలు లో ఏర్పాటు చేసిన జైలు రేడియో కోసం మహిళా ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆరుగురు ఖైదీలు ఆర్ జె లుగా విధులు నిర్వహిస్తారు. ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టేందుకు మనం ఒక కుటుంబం అనే భావన కలిగించేందుకు ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది అంటారు వర్తికా నందా.