ఎడారిలో సాగే అత్యంత కఠినమైన డాకర్ ర్యాలీ 2022లో పడనున్నది 33 ఏళ్ల సౌదీ మహిళ రేసర్ మషేల్ అల్‌ ఒబైదన్‌. ఈ రేసులో పాల్గొననున్న తొలి మహిళ కూడా ఆమె. ఈ మధ్యనే వరల్డ్‌ క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌ లో హెయిల్‌ ఇంటర్నేషనల్‌ ర్యాలీ’ టీ3 క్లాస్‌లో రెండో స్థానం దక్కించుకుంది మషేల్.డాకర్ రేస్ లో పాల్గొనేందుకు వ్యక్తిగత ట్రైనర్ తో కలిసి సౌదీ ఎడారుల్లో సాధన చేస్తోంది. ఈ రెస్ లో వేగం ఒక్కటే కాదు నేర్పు సాంకేతిక నైపుణ్యం కూడా ప్రధానం కో డ్రైవర్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అంటోంది మషేల్ .

Leave a comment