వడోదర లో హేమ చౌహాన్,సాధన షా,నీలా షా వంటి కొందరు స్నేహితురాళ్లు ఆస్తా సహేలి అనే బృందాన్ని ప్రారంభించి ఒక శారీ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మంచి మంచి చీరెలు ధరించాలనే కోరిక ఉన్నా పేద మధ్యతరగతి ఇల్లాళ్లు ఇక్కడ కొంత డిపాజిట్ చేసి వేడుకల కోసం చీరెలు అద్దెకు తీసుకోవచ్చు.తిరిగి ఇచ్చాక లాండ్రీ ఖర్చులు పోను మిగతా డిపాజిట్ నీ వెనక్కు ఇస్తారు నిర్వాహకులు.ఏడాదికి ఓసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా చీరెలు కూడా పొందవచ్చు. డబ్బులేక మంచి చీరె కూడా కనుక్కోలేకపోయామే అని బాధపడే పేద స్త్రీల కోసం ఈ ఏర్పాటు అంటారు నిర్వాహకులు.

Leave a comment