మామూలుగా మనం చూసే ఖరీదైన హోటళ్లలో చక్కని ఆతిథ్యం ఇచ్చే ఎంతో మంది ఉద్యోగులు కనిపిస్తారు. కానీ హోటల్ లోకి అడుగు పెట్టగానే ఓ డైనోసార్ రోబో స్వాగతం పలికితే మరో వెయిటర్ రోబో చక్కగా పలకరిస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇది వట్టి అపోహ ఊహలు కావు నిజంగానే ఓ హోటల్లో అన్ని పనులు చేసి పెట్టె రోబో లున్నాయి. దాని పేరు HENNNA. పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలతో నిర్వహించే ఈ హోటల్ జపాన్ లోని సాగా సాకీ లో ఉంది. రోబోలు యంత్రాల్లా ఉండవు అందమైన జపనీస్ అమ్మాయిల్లా ఉంటాయి ఒక్క రోబో అమ్మాయి ఐదారు భాషల్లో ఆ సర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాయి. ఈ హోటల్లో ఉండే గదులు ఈరోబోలే శుభ్రం చేస్తాయి అతిథులు రాగానే చిరునవ్వుతో పలకరించి లగేజ్ అందుకుంటాయి. హోటల్ గదులకు తాళాలు ఉండవు వ్యక్తుల ముఖాలు గుర్తింపు ద్వారా తలుపులు తెరుచుకుని ఉంటాయి. అయితే ఇక్కడ రుచికరమైన వెరైటీ ఫుడ్ ఏమీ దొరకదు స్నాక్స్ కొన్ని డ్రింక్ లు ఉంటాయి.ఇవన్నీ రోబోలు సర్వే చెయవు ఎవరికి వాళ్లు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి కావాల్సినవి వెండింగ్ మిషన్ ద్వారా తెచ్చుకోవాలి. మొత్తం 72 గదులు వరకు ఉన్నాయి. ఈ హోటల్లో రూముల్ని ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హోటల్ కార్యకలాపాలు ఇంకో మేనేజర్ రోబో చూస్తూ ఉంటుంది. రోబో రిసెప్షనిస్ట్ కీబో ఉంది. రెండు డైనోసార్ రోబో లు ఉన్నాయి రోబోలన్ని ప్రాథమికమైన ప్రశ్నలు అర్థం చేసుకుంటాయి. పరస్పరం సంభాషించే అంత ఫీడ్ చేసి ఉండవు. హోటల్ శుభ్రంగా అన్ని వసతులతో ఉంటుంది. కొన్ని అదనపు అవసరాల కోసం మామూలు మనుషులు ఉద్యోగులుగా ఉంటారు. కనుక వాళ్ళ సాయం తీసుకోవచ్చు.
Categories