అడవులు,కొండ ప్రాంతాల్లో స్థానికులు వాళ్ళ అవసరాలకు ఉపయోగ పడేలా చెట్లవేళ్ళు ఊడలు,తాళ్ళతో వంతెనలు నిర్మిస్తుంటారు . అవి కాంక్రీట్ నిర్మాణాల్లాగే గట్టిగా నమ్మికగా ఉంటాయి . పేరూ లోని ఆండీస్ పర్వతాల మధ్య ఉరుబంబా నదిపైన క్వేష్వా చాకా అన్న పేరున్న వంతెన పొడవు 18 అడుగులు ఎత్తు 4800 మీటర్లు . ఒల్లంటే టాంబో నగరానికి రాకపోకలు సాగించేందుకు గాను స్థానిక ఇస్కా తెగవాళ్ళు ఈ తాళ్ళ వంతెన నిర్మించు కొన్నారు . ఏడాదికో సారి కొత్త తాళ్ళతో రీప్లేస్ చేస్తారు ఎంతమంది ఎక్కినా,గుర్రాల పైన ప్రయాణం చేసిన ఈ వంతెన చెక్కు చెదరదు .