ఒక రచయిత జీవితం మనిషి జీవితంలో రెండే రెండు దుర్గుణాలు ఉంటాయంటాడు.ఒకటి అసహనం రెండు అత్యాస ఈ రెండింటి వల్లనే మనిషి జీవితంలో సుఖ సంతోషాలకు దూరం అవుతారు అంటాడు ట్రాఫిక్ లో ముందు వాహనం స్లో అయితే అసహనం. రైలు కాస్త ఆలస్యం అయితే, వాచ్ మెన్ గేట్ తీయటం లేట్ చేస్తే అడిగీ అడగకముందే వంటింట్లోంచి ఏ  కాఫీ నో మంచినీళ్లో ఒక నిమిషం ఆలస్యం  అయితే  ఫోన్ వెంటనే తీయకపోతే.. పిలవగానే పాలక్కపోతే ఇలా ప్రతిదానికీ  ఇంటా బయట ప్రతి చిన్న పెద్ద విషయంలో మనిషికి అసహనం. ఇలాంటి  మనస్థితి ఉంటే సామాజికంగా, వ్యక్తిగతంగా కూడా తీరని నష్టమే ఏదైనా అనుకుంటే చేయాలి. సంతోషం, విచారం దేన్నైనా సహనంతో తీసుకోరు మామూలు రొటీన్ లో ఎలా ఉన్న కీలక సందర్భాల్లో సహనం కోల్పోతే మాత్రం ఇబ్బందులు తప్పవు సహనం ఒక  సుగుణం సహనం లేకనే జీవితాలు దుర్లభమై పోతాయి.

చేబ్రోలు శ్యామ సుందర 
9849524134

 

Leave a comment