Categories
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఎడిబుల్ కట్లరీ ట్రెండ్ మొదలైంది. అంటే రుచికరమైన పదార్థాలతో తయారయ్యే స్పూన్ లు, ప్లేట్లు, కప్పులు ఇవి వాడిన తర్వాత హాయిగా తినవచ్చు. మల్టీ గ్రెయిన్ పిండితో తయారయ్యే ఈ కట్లరీ లో 14 శాతం డైటరీ ఫైబర్ 10 గ్రాములు ప్రొటీన్లు, 2 శాతం పొటాషియం, 7 శాతం క్యాల్షియం, 33 శాతం ఐరన్ ఉందని లెక్కలు తేల్చారు పోషకాహార నిపుణులు. తినే డిష్ కన్నా ఈ కట్లరీ నే ఆరోగ్యవంతమైన పోషకాలుంటాయి. కాఫీ ముగ్ అయితే వేడి కాఫీ తాగేసి బిస్కెట్ లాగా తినచ్చు. వినియోగదారుల టేస్ట్ కు తగ్గట్లు పాలకూర, బీట్ రూట్, చాక్లెట్, మసాలా, నల్లమిరియాలు, పొదీనా వంటి రకరకాల రుచులతో ఈ ఎడిబుల్ కట్లరీ తయారు చేస్తున్నారు ఉత్పత్తిదారులు