జుట్టుకు రంగు ఇవ్వాళ కామన్ .అలాగే ఫ్యాషన్ కోసం కూడా హెయిర్ కలర్ షేడ్స్ మారుస్తూ ఉండటం అమ్మాయిలకు అలవాటు .ఇవి చూసేందుకు చాలా బావుంటాయి. కానీ వెంట్రుకలు రఫ్ గా అయిపోతూ ఉంటాయి. ఇవి సాఫ్ట్ గా మార్చటం తేలికే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వారం వారం తప్పని సరిగా హెయిర్ కేర్ కార్యక్రమం అమలుపరచాలి.రోజుమార్చి రోజు తప్పని సరిగా నూనె అప్లైయ్ చేయాలి. రాత్రిపూట ఈ ఆయిల్ మసాజ్ చేసి ఉదయాన్నే కడిగేయాలి.కండిషనర్ సెరంలను ప్రతి వాష్ తర్వాత వాడాలి. ఇలా వెంట్రుకలు రఫ్ గా అవుతూ ఉంటే కెమికల్ చికిత్సలకు దూరంగా ఉండాలి. సహాజమైన మాస్కులు జుట్టుకు అప్లైయ్ చేయాలి. మెంతిపొడి,పెరుగు గోరింటా వంటివి జుట్టుకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు సిల్క్ లాగా అయిపోతుంది.

Leave a comment