నీహారికా,
మనందరికీ చక్కని భాంధవ్యాలు మెయిన్ టెయిన్ చేయాలి అని వుంటుంది. ఎదుటి వాళ్ళలో మంచి క్వాలటీని చుదగాలిగితేనే భాంధవ్యాలు బావుంటాయి. ఎప్పుడు ఎవరైనా ఒకే రకంగా ఉండరు. కాలంతో పాటు ఎంతో మంది మారుతూ ఉంటారు. ఒకే రకంగా వుండటం సాధ్యం కాదు కుడా. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎదుటి వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్ వ్యక్తం చేసే ఆవకాశం ఇవ్వాలి. వాళ్ళను ఎలా వున్నా వాళ్ళను అలా ఆమోదించాలి. కొన్ని సార్లు వాళ్ళ వల్ల నిరుత్సాహా పడతాం. కోపం కుడా వస్తుంది. కానీ ఈ తాత్కాలిక ఎమోషన్స్ అవతల పెట్టి ఎదుటి వాళ్ళ వ్యక్తి గతానికి ప్రాముఖ్యాత ఇవ్వాలి. అలాగే మన జీవితం కుడా మొత్తం మన చేతిలో వుండదు. అవసరమైతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవలసి వస్తుంది. అలాగే వారి అవసరాలతో మనము ఆదుకోవాలి. మన్యుషుల మధ్య భాంధవ్యయాలు కలకాలం సజావుగా ఉండాలంటే మనకు కొంత ఓర్పు సహనం నొప్పింపాక తానొవ్వక అనే ధోరణి వుండాలి.