హోమ్‌లెస్ పుస్తకంతో ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ యువ పురస్కారం (ఇంగ్లీష్) అవార్డ్ తీసుకుంది రచయిత్రి కె.వైశాలి. 22 సంవత్సరాల వయసులో ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో ఎలాంటి వసతులు లేని హాస్టల్ లో ఉంటూ తను ఇబ్బంది పడిన డిస్క్ లెక్సియా డిస్క్ గ్రాఫియా ల సమస్యలు అలాంటి మానసిక వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజం నిర్లిప్తంగా ఉండటం విద్య వ్యవస్థల్లో ఉన్న లోపాల గురించి వైశాలి తన పుస్తకంలో చర్చించింది. యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్ సెక్రెటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్.జోషి రాసిన అభినందన లేఖ తనకు ఎంతో ఓదార్పు ఇచ్చిందని చెబుతోంది రచయిత్రి కే వైశాలి.

Leave a comment