Categories
సముద్రపు అలలపై ఆడుకోవటాన్నే కెరీర్ గా ఎంచుకుంది షుగర్ శాంతి బనార్సే గోవా లోని ఒక సముద్రతీర ప్రాంతంలో పుట్టిన బనార్సే సర్ఫింగ్ నేర్చుకుంది. ఆమె ప్రతిభను గమనించి పుదుచ్చేరి లో ఉచిత శిక్షణకు ముందుకు వచ్చారు సమై డి కల్లిలాయ్. నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది షుగర్. ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నది. 19 ఏళ్ల షుగర్ సముద్రం తనకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది అంటుంది. సవాళ్లను స్వీకరించండి మీకు అన్నీ సాధ్యమవుతాయి అంటుంది అమ్మాయి.