సంతోషాన్ని పంచే మాత మన సంతోషిమాత . అన్ని వేళల సంతోషంగా వుండటానికి ఈ మాతకి ముతైదువులు వ్రతం చేయడం ఒక ఆచారం.  ఒక కుటుంబంలో భార్య- భర్తలు మానసికంగా,శారీరకంగా బాధ పడుతున్న సమయంలో సంతోషిమాత వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం చూసి భక్తులు  నిశ్చేష్టులైనారు.   సంతోషిమాతకి భక్తులకు సంతోషాన్ని పంచటమే తెలుసు. ప్రతి శుక్రవారం సంతోషిమాతని పూజించడం మనం చేసే పనే కదా!!3/5/9/11 శుక్రవారాలు ఉపవాసం ఉండి, మాత కథ చదువుకుని,సాయంత్రం ముతైదువులకు పసుపు, కుంకుమ,గాజులు,పూలు,పండ్లు,రవిక ఇచ్చిన పుణ్యం-పురుషార్ధం.సంతోషిమాత పూజ ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.జగమేలు జగత్జనని.భక్తులకు కష్టాలు దరిచేర కుండా కాపాడే అమృతవల్లి.

ఇష్టమైన పూలు: కనకాంబరాలు,చేమంతులు,గన్నేరు.

ఇష్టమైన పూజ:ముతైదువులు ఉపవాసం ఉండి తన కథను చెప్పుకోవటం.

నిత్య ప్రసాదం: సంతోషిమాత కు పులుపు అనివార్యం. కొబ్బరి,పులుపు లేని పండ్లు, శనగపిండి లడ్డు.

లడ్డు తయారీ: శనగపిండి,పంచదార,జీడిపప్పు,కిస్మిస్,యాలకుపొడి ముందుగా  శనగపిండిని దోరగా వేయించి,పంచదార మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.రెండు కలిపి యాలకుపొడి,జీడిపప్పు,కిస్మిస్ తో అలంకరించి…మైతో ఆరతీ… వుతారూరే..
సంతోషిమాత కి….అని పాడుతూ నైవేద్యం పెట్టడమే!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment