Categories
రోజంతా కూర్చోనే ఉద్యోగాలే కనుక ఖచ్చితమైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయగలిగితే ధృడంగా ఉండగలుగతారని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. కూర్చున్న,నిల్చున్న ,పడుకొనే పోజిషన్లు సరిగ్గా ఉన్నప్పుడు పోశ్చర్ చక్కగా కనిపిస్తుంది.మెడ ,భుజాలు,వెన్ను లేదా ఇతర నొప్పులు లేకుండా ఉండేందుకు మంచి పోశ్చర్ అవసరం . కూర్చుని వెన్నుకు సపోర్ట్ చేసే విధంగా సర్ధుబాటు చేసుకోవాలి.సౌకర్యంగా కాకుండా నెమ్మదిగా కాకుండా వీపు చక్కగా ఆనేలా ఏర్పాట్లు చేసుకోవాలి .తల స్ట్రెయిట్ గా పెట్టి పని చేసుకోవాలి. పక్కకు తిప్పి ,వంగి కూర్చోవద్దు .తిన్నగా కూర్చుంటే లోయర్ బ్యాక్ పెయిన్ రాదు. మధ్య మధ్యలో భుజాలు ,వెన్ను ఓ పోజిషన్ లో వంచి రిలాక్స్ అవ్వాలి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా ఉంచాలి.