గురుగ్రామ్ లో పుట్టిన గరిమా సాహ్నీ ప్రముఖ హాస్పిటల్స్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేశారు.భర్త వైభవ్ తో కలిసి వైద్య సేవలు టెక్నాలజీ జోడించి ‘ప్రిస్టిన్ కేర్’ ప్రారంభించారు టెక్నాలజీ తో నాన్ ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం ప్రారంభించారు.ట్రీట్ మెంట్ సులువుగా రోగికి ఇబ్బంది లేకుండా ఉండటంతో చాలా మంది ఈ ‘ప్రిస్టిన్ కేర్’ పైన ఆసక్తి చూపెడుతున్నారు.దేశ వ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్ లో ఒప్పందాలు చేసుకొన్నా ప్రిస్టిన్ కేర్ మూడేళ్ళలో 2021 లో యూనికార్న్ హోదా దక్కించుకున్నది.యూనికార్న్ స్థాయి అంటే బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం అని అర్థం.