ఎప్పుడేనా హడావిడిగా ఏ పార్టికో వెళ్ళాలంటే అప్పటికప్పుడు గోళ్ళ రంగు వేసుకుని వెంటనే ఆరిపోవాలంటే రెండు నిమిషాలు ఐస్ నీళ్ళలో చేతులు ముంచితే చాలు. గోళ్ళరంగు సీసాను షేక్ చేయలి అనిపిస్తే రెండు చేతుల మధ్య ఉంచుకుని గుండ్రంగా తిప్పాలి. అప్పుడు సీసాలో బుడగలు రాకుండా ఉంటాయి. గాలి కూడా లోపలికి చేరడు. గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తొలగించాలంటే రిమూవర్ లో ముంచిన దూదిని గోళ్ళ పై కాసేపు ఉంచి గట్టిగా తుడవాలి.అలా రంగు తొలిగించాక గోళ్ళు పొడిబారకుండా చేతులకు,గోళ్ళకు బేబీ ఆయిల్ రాయాలి. గోళ్ళ రంగు గోళ్ళ పైన కాకుండా చుట్టు ఉన్న చర్మం పైన అంటుకుంటే నెయిల్ పాలిష్ రిమూవర్ లో ముంచిన కాటన్ తో చుట్టు జాగ్రత్తగా తుడిచేస్తే సరి. వేసిన రంగు ఎక్కువకాలం ఉండాలంటే రంగు వేశాక పైన బేస్ కోట్ వేస్తే సరిపోతుంది.

Leave a comment