పడుకునే ముందర ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు అమెరికా లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డ్ కి చెందిన పరిశోధకులు.పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ మనసుకి స్వాంతన ఇచ్చే సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుంది.ఈ సెరోటోనిన్ జీవ గడియారాన్ని నియంత్రిస్తూ నిద్ర కు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ విడుదల చేస్తుంది.ఈ కారణం వల్లనే పాలు తాగితే నిద్ర వస్తుంది నిద్ర వల్ల ఏమైనా తినాలనే కోరిక తగ్గుతుంది బరువు తగ్గటం ప్రారంభం అవుతుంది.జీవక్రియ వేగం పెరిగి గ్లూకోజ్ నిల్వలు పేరుకోవు.

Leave a comment