బొప్పాయి జుట్టుకు మేలు చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . కప్పు బొప్పాయి ముక్కలు మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి ఇందులో పెరుగు శనగపిండి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.అలాగే నాలుగు స్పూన్ ల బొప్పాయి గుజ్జుకు రెండు స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేస్తే జుట్టుకు పోషణ అంది మెరుపుగా దృఢంగా ఉంటుంది. జుట్టు రాలటం తగ్గుతుంది.

Leave a comment