పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు స్వీయ నిర్ణయం ఎక్కువ వుంది అని వారు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు అని తేలింది. పాశ్చాత్యదేశాల్లో పిల్లలను ఆలస్యంగా స్కూల్ లో చేరుస్తారు. ఉదాహరణకు ఫిన్లాండ్ లో పిల్లలను ఎనిమిది ఏళ్ల నుండి పిల్లలను స్కూల్ కి పంపడం మొదలు పెడతారు. రెండున్నార, మూడేళ్ళకే పిల్లలను స్కూల్ కు పంపడం వల్ల వాళ్ళకు కొత్తగా వచ్చే లాభం ఏమి వుండదు అని తల్లిదండ్రుల ఆదరణలో ముద్దుగా పెరిగి ఐదేళ్ళ వయస్సులో స్కూల్లో చేరడమే పిల్లలకు మేలు అంటున్నాయి అధ్యయనాలు.
Categories