పోలీస్ అధికారి విజయ్ సింగ్ ఒక అండర్ వరల్డ్ ముఠా ను పట్టుకునే క్రమంలో కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు.అతని భార్య చనిపోతుంది గ్యాంగ్ స్టర్ లను అంతం చేసే అవకాశం కూడా పోయి నాసిక్ లోని పోలీసు శిక్షణా కేంద్రంలో కొత్త ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది.ముంబై పోలీస్ ఫోర్స్ లో చేరిన ఐదుగురు యువకులను ఎంచుకుని శిక్షణ ఇచ్చి, పోలీస్ వ్యవస్థ లో కి పంపుతాడు.ముంబై లోని నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరిన యువకులు నగరాన్ని గుప్పెట్లోకి తీసుకున్న గ్యాంగ్ స్టర్  లను అంతం చేస్తారు.ఎక్కడ ఎలాంటి రుజువు సాక్ష్యాలు లేకుండా ఒక పథకం ప్రకారం జరిగిన ఎన్ కౌంటర్  విజయవంతంగా పూర్తిచేస్తాడు. జర్నలిస్ట్  హుస్సేన్ ఖైదీ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమా  చాలా బావుంది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రవిచంద్ర.సి
7093440630

Leave a comment