ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి  పడుకునే వరకు మాట్లాడుతూ ఉంటాం.లక్షలాది పాదలు నోటివెంట దొర్లుతుంటాయి.ఈ మాట్లాడే మాటల్లో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలదు అంటే చెప్పలేం కదా.ఈ విషయంలో పరిశోధకులు 17 లక్షల పదాల పై పరిశోధనలు చేశారు. వాడే పదాల్లో అమ్మమ్మ,నాయనమ్మ  వంటి వరసలు మనం మనకు నేను మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని ఇస్తాయని గుర్తించారు. నిరంతరం వాడే ఐ ఫోన్ గూగుల్ వంటి వస్తు సంబంధిత పదాలు ఉచ్చారణలో మనసు పొందే సంతోషం  ఏది ఉండదట సంబంధం బాంధవ్యాలకు సంబంధించిన పదాలు తప్ప ఏ ఇతర వస్తు సంబంధిత పదాలు ఏ ప్రభావం చూపించవు. సంబంధం బాంధవ్యాలు సంతోషాన్నిస్తాయి.కానీ  వాటితో పోలిస్తే మెటీరియల్ థింగ్స్ పెద్ద ప్రభావం చూపించవు . కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటేనే సంతోషం కలుగుతుందట మనసుకు తెలియకుండానే మనం వాడే పదాలు మనకు స్వాంతన ఇస్తాయంటే నిజమైన ఆ బాంధవ్యం ఇంకెంతటి అపురూపమైనది.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134  
 

Leave a comment