మహిళలు పని చేసే కార్యాలయల్లో వేధింపులు ఎదురైతే వారికి చేయాత సందించేందుకు ముందుకు వచ్చింది శక్తి . ఉద్యోగినులు తాము ఎదుర్కొంటున్న వేధింపులకు సంబంధించిన వివరాలు ఫేస్ బుక్ లోకి మీటూ ఇండియా ఫేజ్‌లోకి శక్తికి ఫిర్యాదు చేస్తే చాలు .సరైన మార్గాన్ని సూచించి చేయుతనందిస్తుంది. లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఎదుర్కోనేందుకు గాను చట్ట పరమైన చర్యల వివరాలు వక్తి ద్వారా బాధితులు తెలుసుకోవచ్చు. సిలికాన్ వ్యాలీకి చెందిన గుడ్ షుప్ అనే సోషల్ మీడియా వేదిక ఈసేవలు ప్రారంభించింది. గాప్ షుప్ మార్కెటింగ్ హెడ్ అనిందితా గుహ మాట్లాడుతూ ఈ శక్తి సేవలు 24 గంటలు వినియోగించుకోవచ్చని మహిళలు ఆత్మస్థైర్యం పెంపొందించుకొని తమ సమస్యను ధైర్యంగా చెప్పుకొనేందుకు ముందుకు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.