నీహారికా,
ఇప్పుడున్న చిన్ని కుటుంబాల్లో అంటే అమ్మా నాన్న పిల్లలు మాత్రమే వుండే చూట పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవడం, కుటుంబ విలుఅలు గురించి నేర్పడం కష్టమే. కానీ అవసరం కదా. అప్పుడు అమ్మా నన్నా ఇందుకు నడుం కట్టాలి. ఇంటా బయటా వాళ్ళ ప్రవర్తన పట్ల ఒక కన్నేసి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ తో ఎలా మెలగాలో, భోజనం చేయడం నేర్పినంత కష్టపడి నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వాళ్ళను ప్రేమించడం మంచి నడవడికలో భాగాలే. పిల్లల మధ్య చిన్ని చిన్ని గొడవలు వస్తే ముందుగా క్షమించడం గురించి చెప్పాలి. అది నిజంగా గొప్ప కళే. చిన్ని చిన్ని విషయాలకే ఇతరుల పై కోపం తెచ్చుకోవడం, తిట్టుకోవడం చేయడం కంటే వారిని క్షమించడం అలవాటు చేసుకోమని నేర్పాలి. కుటుంబ సభ్యులతో ఎంత బాగా మెలగాలో ఎలా గౌరవించాలో, అనుచితంగా మాట్లాడటం ఎంత తప్పో అన్నీ నేర్పాలి, పిల్లలు మట్టి ముద్దలలాంటి వాళ్ళు. వాళ్ళని మంచిగా మలుచుకోవచ్చు. ఆమంచి పౌరుగా తీర్చి దిద్దచ్చు. ప్రతి తల్లి దండ్రీ ఇలా అనుకుంటే అసలు సమాజమే మారిపోతుంది.