జిడ్డు పట్టే వంటిళ్ళు ప్రతి అంగుళం శుభ్రం చేయటం చాలా కష్టం. కొన్ని వస్తువులతో గది గోడలు శుభ్రంగా ఉంచుకోవచ్చు బజార్లో దొరికే ఆయిల్ ప్రూఫ్ రోల్స్ గోడలకు అతికిస్తే జిడ్డు పట్టకుండా ఉంటాయి. లేదా వాటిని కడగటం తేలికగా అవుతోంది అలాగే గదులు,వంటింటి గట్టు శుభ్రంచేసే వస్త్రాలు ఒకటి రెండు సార్లకే మురికిగా అయిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా లింట్-ఫ్రీ వస్త్రాలు దొరుకుతాయి. ఆధునికమైన క్లీనింగ్ టూల్స్ ఎన్నో మార్కెట్ లోకి వచ్చాయి. వాటి వాడకం కూడా చూపించే యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి.చేతులతో తోమి, శుభ్రం చేయటం సాధ్యం కాని సమయంలో కొన్ని క్లీనింగ్ టూల్స్ కొనిపెట్టుకోవాలి మంచిదే.

Leave a comment