మనం నిలబడే తీరు మాట్లాడే పద్దతి కూర్చునే పొజిషన్ మొత్తంగా మన బాడీ లాంగ్వేజ్ మన గురించి అవతల మాయిషీకి చెప్పేస్తాయి. అంటున్నారు నిపుణులు. మనం కాస్త ప్రయత్నం చేస్తే ఎవరి ముందరైనా మనం ధీమాగా వుంటుందంటున్నారు. ఎప్పుడు తలెత్తు కొనే ఠీవీగా ఉండాలి. నేను దేన్నీ ఆషామాషీగా తీసుకోను . ప్రతీదీ నా కంట్రోల్ లో ఉంచుకోగలను అని చెప్పేలా ఉండాలి మన శరీర భాష. లేదా తలొంచుకుని సిగ్గు పడుతున్నట్లు దిక్కులు చుస్తే కార్పొరేట్ ఉద్యోగాల్లో నెగ్గటమూ అసలు పది మంది ముందు వాళ్ళతో సూచనగా నిలబడటమూ కష్టమే. వెంట్రుకలు సర్దుకోవటం ముఖం పదేపదే తుడుచుకోవటం చేతిలో పడే పడే టక్ టక్ మని నొక్కటం మన మనసులో ఆందళోనని ఎదుటి వాళ్ళకి చేరేస్తుంది. చేతులు చక్కగా స్థిరంగా పెట్టుకోవాలి. ఎవరి ముందు వినయంగా వంగి పోతూ సమాధానం చెప్పటం తప్పే. ఏదైనా ఇంటర్వ్యూ సమయంలో ఇది మరీ ప్రమాదం. స్థిరంగా నిలబడటం చూడటం మాట్లాడటం ఆత్మ విశ్వాసాన్ని చాటుతుంది. మనసు ఎంత తేటగా వుందో చెపుతోంది. అందుకే ఎప్పుడు మన మనసు బయటపడేలా ప్రవర్తించకూడదంటున్నారు నిపుణులు .
Categories