రిషి కపూర్ చివరి సినిమా ఇది. ఢిల్లీ లో మిడిల్ క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తను పనిచేసే కంపెనీ దివాలా తీయడం తో వి.ఆ.ఎస్ తీసుకోవాల్సి వస్తుంది. భార్య చనిపోతుంది. ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఉద్యోగం, చిన్నవాడు కాలేజీ.శర్మాజీ కి జీవితం ఉత్సాహంగా ఉండాలని ఉంటుంది. ఏదో ఒక పని చేయాలి. కొడుకు గుళ్ళూ గోపురాలు తిరగ మంటాడు శర్మ కు నచ్చదు చివరకు ఒక ఫ్రెండ్ సలహాతో తనకు చాలా ఇష్టమైన వంట పని చేయాలనుకుంటాడు. కిట్టి పార్టీ చేసుకునే ఒక స్త్రీల గ్రూపు తో పరిచయం అయ్యి ఆ పార్టీలకు అద్భుతంగా వంట చేస్తుంటాడు. పిల్లలకు ఈ విషయం తెలిసి గొడవవుతుంది శర్మ కు పిల్లలకు మధ్య వయసు కు సంబంధించి పెద్ద గ్యాప్ ఉంటుంది. ఎవ్వళ్లూ మనసు విప్పి మాట్లాడుకోని సమస్య చివరకు పెద్ద కొడుకు ఆర్థిక విషయంలో వచ్చిన ఒక సమస్య ద్వారా పరిష్కారం కోసం పడే ప్రయాణంలో తండ్రి పిల్లలు దగ్గరవుతారు ఈ సినిమా సగం ముగించాక రిషీకపూర్  చనిపోతే పరేష్ రావల్ తో సినిమా పూర్తి చేశారు. అయినా సినిమా చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడండి.

Leave a comment