తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నారు జయంతి చెన్నై లోని మైలాపూర్ లో ఉన్న క్లార్క్ స్కూల్లో కనీసం వెయ్యి మంది స్పెషల్ చిల్డ్రన్ కు కనీస చదువు ప్రవర్తన నేర్పారు జయంతి. ఆమె పనిచేస్తున్న స్కూల్లో రకరకాల మానసిక శారీరక లోపాలతో ఉన్న పిల్లలు చేరుతారు వారి లోపాలు స్థాయిలను బట్టి వారికి తర్ఫీదు ఇవ్వాల్సి వుంటుంది. ఎం.ఎస్.సి సైకాలజీ స్పెషల్ చిల్డ్రన్స్ కు చదువు చెప్పే డిప్లొమా కోర్స్ చేశారు జయంతి. 1984 నుంచి ఆమె ఈ స్కూల్లో పనిచేస్తోంది. కరోనా సమయంలో పిల్లలకు మాస్క్ ధరించమని చెప్పటం వాళ్ళ చేత కరోనా జాగ్రత్తలు పాటించేలా చేయటం అదొక పెద్ద ఘనవిజయం అంటుంది జయంతి. ఒక పిల్లవాడు ప్లేట్ కింద పడకుండా భోజనం తీసుకున్న తనకు తానుగా వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన అది నాకు, పిల్ల వాడికి గొప్ప సంగతే అంటుంది జయంతి.

Leave a comment