ప్రపంచం మొత్తం పరిగెత్తాలి అని ఉంది తప్పకుండా పరిగెత్తి చూపిస్తా అన్నది అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్ సాంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మించిన మారథాన్ ను అల్ట్రా మారథాన్ అంటారు. సుఫియా ఏకదాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్. ప్రపంచంలో ఆమె లాగా పరిగెత్తే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తే ఒక రికార్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే జైపూర్ ఢిల్లీ, ఆగ్రా లో పరిగెత్తి ఒక రికార్డ్, తాజాగా మనాలి నుంచి లేహ్‌ వరకు మొత్తం 480 కిలోమీటర్ల దూరాన్ని 146 గంటల్లో పరుగుతీసింది సముద్రమట్టానికి 670 ఎత్తులో ఉన్న మనాలి నుంచి 11,500 ఎత్తున్న లేహ్‌ వరకు ఈ రెండు ఎత్తుల  మధ్య పరుగుతీసిందంటే సూఫియా ఎంత గ్రేట్.

Leave a comment