షిమ్లాకి దగ్గరలో ఉన్న రాంపూర్ లో దుర్గామాత రూపంలో పార్వతి దేవి వెలసింది.
శివపార్వతులు తమ కుమారులైన గణపతి,కుమారస్వామి లకు మూడులోకాలను ఎవరైతే చుట్టి వస్తారో వారికి ఆధిపత్యం వస్తుంది అని చెప్పారు.మయూర వాహనంతో కుమారస్వామి బయలుదేరాడు కాని గణపతి సూక్ష్మ బుద్ధితో తల్లి దండ్రుల చుట్టూ తిరిగి కాళ్ళకు నమస్కరించాడు.ఆధిపత్యం గణపతికి దక్కినందుకు బాధతో తను వివాహం చేసుకోను అని శపధం చేసిన కుమారస్వామిని దివ్య దృష్టి తో చూస్తుండగా పార్వతి దేవికి స్ధల ప్రభావం వలన అని గ్రహించి దుర్గ మాత రూపంలో ఆ ప్రదేశంలో స్ధిరపడి, దర్శనార్ధం వచ్చినా దంపతులుగా రాకూడదూ అని నిబంధన ప్రకారం ముందు భార్య దర్శించిగా, తదుపరి భర్త వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దంపతులు గా వెళ్ళకూడని ఏకైక ఆలయం .
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు
-తోలేటి వెంకట శిరీష